కాళోజీ యూనివర్సిటీలో 2 నుంచి వెబ్ కౌన్సిలింగ్

కాళోజీ యూనివర్సిటీలో 2 నుంచి వెబ్ కౌన్సిలింగ్వరంగల్ అర్బన్ జిల్లా : కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహకులు తెలిపారు. ఈ మేరకు నేడు వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 2వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు అభ్యర్ధులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. యూనివర్సిటీ వెబ్ సైట్ లో పొందుపరిచిన తుది మెరిట్ జాబితాలోని అభర్ధులందరూ వెబ్ కౌన్సిలింగ్ కు అర్హులని తెలిపారు. వారంతా ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాలని తెలిపారు. కళాశాలల వారీగా ఖాళీలను వెబ్ సైట్ లో పేర్కొన్నట్లు పేర్కొన్నారు. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.