పార్కుల అభివృద్ధి పనులను పరిశీలించిన పమేలా

పార్కుల అభివృద్ధి పనులను పరిశీలించిన పమేలావరంగల్ అర్బన్: సరిగమపదనిస పార్క్ పనులు డిసెంబర్ చివరి కల్లా పూర్తి చేయాలని కుడా వైస్ చైర్మన్ , జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. హన్మకొండ పద్మాక్షి గుండం వద్ద కొనసాగుతున్న సరిగమపదనిస పార్క్ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. పార్కును ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భువనేశ్వర్ నుండి ప్రత్యేకంగా తెప్పించిన సరిగమపదనిస ఇన్ట్రుమెంట్స్, వాయిద్యాలను ఈ పార్క్ లో ఏర్పాటు చేయడంతో పాటు ఆహ్లాదాన్ని వెదజల్లే విధంగా గ్రీనరీ, పలు రకాల ఒర్నమెంట్ మొక్కలను నాటాలని ఆమె అన్నారు. అభివృద్ధి పనులన్నీ నిత్యం పర్యవేక్షిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా పూర్తయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో కుడా ప్రాజెక్టు అధికారి అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు, డి ఈ రాజ్ కుమార్, ఏ ఈ లు భరత్, సిద్దార్థ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.