ఓటు వేయడానికి మెల్బోర్న్ నుంచి వచ్చారు

ఓటు వేయడానికి మెల్బోర్న్ నుంచి వచ్చారుహైదరాబాద్ : మెల్బోర్న్ లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న జీహెచ్ ఎంసీ అడిషనల్ కమిషనర్ శంకరయ్య కుమారుడు రిత్విక్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయడానికై హైదరాబాద్ కు వచ్చాడు. అసలైతే, జనవరి రెండో మాసంలో హైదరాబాద్ కు రావాల్సిన రిత్విక్ నెల ముందుగానే వచ్చి తన తండ్రి జె. శంకరయ్య, తల్లి కవిత లతో కలసి పేట్ బషీరాబాద్ పాఠశాల లోని పోలింగ్ కేంద్రం లో ఓటు వేశారు. కేవలం ఓటు హక్కు వినియోగించడానికై వచ్చిన రిత్విక్ కు ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని పలువురు అభినందిస్తున్నారు.