రంగులు మార్చుతున్న కారు..త్వరలో భారత్ కు

రంగులు మార్చుతున్న కారు..త్వరలో భారత్ కు

రంగులు మార్చుతున్న కారు..త్వరలో భారత్ కు

వరంగల్ టైమ్స్, లైఫ్ స్టైల్ : జర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ అమెరికాలోని లాస్ వేగాస్ లో జరుగుతున్న సీఈఎస్ ఈవెంట్ లో ఓ కొత్త కారును ప్రదర్శించింది. ఆ కారును చూసి అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎందుకంటే ఆ కారు 240 రంగులు మార్చింది. ఈ కారు పేరు ‘ఐ విజన్ డి’. పరిస్థితులను బట్టి రంగులు మార్చే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో ఉపయోగించారు. డ్రైవర్ ఏ మూడ్ లో ఉన్నాడన్నది పరిగణనలోకి తీసుకుని ఈ కారు రంగులు మార్చేస్తుంది. అందుకోసం ఈ-ఇంక్ టెక్నాలజీ ఉపయోగించారు.

ఈ ‘ఐ విజన్ డి’ కారును భారత్ లోనూ తీసుకువచ్చేందుకు బీఎండబ్ల్యూ ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే రెండేళ్ల తర్వాతే ఇది భారత్ లోకి రానుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉన్న ఈ కారును త్వరలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు బీఎండబ్ల్యూ సన్నద్ధమవుతోంది. ఈ కారులో మరో కొత్త టెక్నాలజీ కూడా ఉంది. ఓ సినిమా తెరపై ప్రదర్శించినట్టుగా, కారు విండ్ షీల్డ్ పై డిజిటల్ ఫార్మాట్ లో డ్రైవింగ్ డేటాను పొందే వీలుంది. కారు వేగం, మైలేజి, నేవిగేషన్ వంటి అంశాలను కారు విండ్ షీల్డ్ పై చూడొచ్చట.