ఇఫ్లూ యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య

ఇఫ్లూ యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఇఫ్లూ యూనివర్సిటీలో హాస్టల్ లోని 4వ ఫ్లోర్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హర్యానాకు చెందిన అంజలి అనే విద్యార్థిని తార్నాకలోని ఇఫ్లూ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ ( సెకండ్ ఇయర్) చదువుతోంది.ఇఫ్లూ యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్యవిద్యార్థిని ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు విద్యార్థిని వాళ్ల తల్లితో మాట్లాడిందని, తల్లితో మాట్లాడుతూనే హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకిందని పోలీసుల సమాచారం. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.