రోడ్డు ప్రమాదంలో ఫోటోగ్రాఫర్లు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఫోటోగ్రాఫర్లు దుర్మరణం

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కోటిలింగాల సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. లారీ, కారు ఢీకొన్న ఈ రోడ్డు ప్రమాదంలో వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ముగ్గురు ఫోటోగ్రాఫర్లు కల్యాణ్ (28), కొంపెల్లి శివకోటి (31), హనుమకొండకు చెందిన ఫోటోగ్రాఫర్ బైరి రాము (32), హనుమకొండ జిల్లా కమలాపూర్ కు చెందిన ఫోటో గ్రాఫర్ బాషబత్తిని అరవింద్ (21)లు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన క్రాంతి అనే మరో ఫోటోగ్రాఫర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం ఖమ్మం నుంచి హైదరాబాద్ కు తరలించారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.