ఆధిక్యంలో టీమీండియా

ఆధిక్యంలో టీమీండియాస్పోర్ట్స్​ డెస్క్​ : టీమీండియాతో డే అండ్​నైట్​ టెస్టు మ్యాచ్​లో బ్యాట్స్​మెన్లు తడబడడంతో ఆతిథ్య ఆసీస్​ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 72.1 ఓవర్లలో 191 రన్స్​కే అలౌటైంది. దీంతో భారత్​కు 53 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకుముందు భారత్​ తొలి ఇన్నింగ్స్​లో 244 పరుగులకు అలౌటైంది. తొలి టెస్టులో టీమీండియా మెరుగైన స్థితిలో నిలిచింది. స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​(4/55) తన మాయాజలంతో కంగారూల పతనాన్ని శాసించాడు. బుమ్రా (2/52), ఉమేశ్​యాదవ్​(3/40)లకు వికెట్లు దక్కాయి. ఆస్ట్రేలియా కెప్టెన్​ టీమ్​పైన్​(73 నాటౌట్​) ఒక్కడే అర్ధశతకంతో మెరిశాడు. టీమీండియా బౌలర్ల కట్టుదిట్టమైన బంతులను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు తడబడ్డారు. గులాబీ టెస్టు రెండో రోజు ఆటలో టీమీండియాదే పై చేయి. 29 రన్స్​కే ఓపెనర్లు మాథ్యూవేడ్​(8)జోబర్న్​(8) ఔటవడంతో క్రీజులోకి వచ్చిన లబుషేన్​ (47) బౌలర్లను ధాటిగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. లబుసేన్​ 54 ఓవర్లో ఔటయ్యాడు. ఉమేశ్​యాదవ్​ వేసిన అదే ఓవర్​లో లబుషేన్​తో పాటు అప్పుడే క్రీజులోకి వచ్చిన పాట్​ కమిన్స్​ డకౌట్ గా వెనుదిరిగాడు. స్టీవ్​ స్మిత్​(1), ట్రావిస్​హెడ్​(7)లను ఆశ్విన్​ పెవిలియన్​ పంపడంతో ఆస్ట్రేలియా ఒత్తిడికి గురైంది. చివరి వరకు క్రీజులో నిలదొక్కుకున్న పైన్​ కాస్త వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపించే ప్రయత్నం చేశాడు.