‘ట‌క్ జ‌గ‌దీష్’ ఫ‌స్ట్ లుక్ అవుట్​

'ట‌క్ జ‌గ‌దీష్' ఫ‌స్ట్ లుక్ అవుట్​

హైదరాబాద్​ : నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ‘ట‌క్ జ‌గ‌దీష్’ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. ఈ ఫిల్మ్‌లో రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నాని న‌టిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ‘ట‌క్ జ‌గ‌దీష్’ ఫ‌స్ట్ లుక్‌ను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా హీరో నాని ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం ఆయ‌న ‘ట‌క్ జ‌గ‌దీష్‌’కు సంబంధించిన ఒక పోస్ట‌ర్‌ను షేర్ చేశారు. అందులో రోట్లో పప్పు దంచుతున్న ఓ స్త్రీ చేయి క‌నిపిస్తోంది. ఆ పోస్ట‌ర్‌పై “The focus shifts on 25th Dec” అని రాశారు. దానికి “This Christmas #TuckJagadishFirstLook” అనే క్యాప్ష‌న్ జోడించారు. నాని హీరోగా న‌టించిన హిట్ మూవీ ‘నిన్నుకోరి’తో ప‌రిచ‌య‌మై, రెండో సినిమా ‘మ‌జిలీ’తోనూ సూప‌ర్ హిట్ సాధించిన శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. టైటిల్‌తోటే ఆస‌క్తిని రేకెత్తిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన ప్రీ లుక్ ఫ్యాన్స్‌ను బాగా ఆక‌ట్టుకుంది. ఫ‌స్ట్ లుక్‌తో సినిమాపై ఆస‌క్తి రెట్టింప‌వ‌డం ఖాయ‌మంటున్నారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:
నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: సాహి సురేష్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)