కాల్పుల కలకలం

కాల్పుల కలకలంఆదిలాబాద్​ జిల్లా : ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో కాల్పులు కలకలం సృష్టించాయి. శుక్రవారం సాయంత్రం పిల్లలు క్రికెట్​ ఆడుతుండగా జరిగిన గొడవ ఈ ఘటనకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. క్రికెట్​ ఆటలో జరిగిన గొడవతో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్​ చైర్మన్​ ఫారూఖ్ ​అహ్మద్ సంయమనం కోల్పోయి తన గన్​, తల్వార్​తో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో మోసిన్​ అనే యువకుడికి బుల్లెట్​ గాయమైంది. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి గాయాలు కాగా వారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్​ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేసి రివాల్వర్​, తల్వార్​ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.​