క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలివిజయవాడ: విద్యార్థులు పాఠ‌శాల‌ స్థాయి నుంచే క్రీడ‌ల‌పై ఆస‌క్తి పెంచుకోవాలని మాజీ క్రికెటర్లు వెంకటపతిరాజు, వేణుగోపాలరావు అన్నారు. యనమలకుదురులో నూతనంగా ఏర్పాటు చేసిన కేకే గ్లోబల్ క్రికెట్ అకాడమీని వారు ప్రారంభించారు. క్రీడారంగానికి విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. భావి చాంపియన్లకోసం క్రికెట్​ అకాడమీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముంబాయి, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఇటువంటి అకాడమీలు ఉన్నాయని తెలిపారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని సాధించుకునే‌ దిశగా విద్యార్థులు కృషి‌ చేయాలని సూచించారు. 14 ఏళ్ల వయసు పిల్లలే కాకుండా 30 ఏళ్లు వాళ్లకు కూడా ఈ అకాడమీ లో ఆడవచ్చని తెలిపారు .చదువులు, ఉద్యోగాలతో బిజీ గా ఉన్నవారు ఫ్లడ్ లైట్ల కాంతిలో సాధన‌ చేయవచ్చని తెలిపారు.