రైల్వే చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ను కలిసిన డీఐజీ

రైల్వే చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ను కలిసిన డీఐజీనల్లగొండ జిల్లా: దక్షిణ మధ్య రైల్వే చీఫ్ సెక్యూరిటీ కమిషనర్, ఐజీజీఎం ఈశ్వర్ రావును నల్లగొండ డీఐజీ రంగనాథ్​ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నల్లగొండకు వచ్చిన రైల్వే ఐజీతో స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే రక్షణ విభాగం, జిల్లా పోలీసుల మధ్య పరస్పర సహకారం, రైల్వే ప్రయాణికుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఇరువురు కొద్దిసేపు చర్చించుకున్నారు.