హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ వివిధ మాధ్యమాల ద్వారా ఒక పబ్లిక్ ఇంటరెస్ట్ మెసేజ్ పంపారు. కరోనా నేపధ్యంలో జరీ చేయబడిన ఈ ప్రకటన ఈమేరకు ఉంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మిమ్మల్ని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ ఒక లిస్ట్ ఆయన ఫార్వార్డ్ చేశారు.“దయచేసి మీరు విధిగా మాస్కును ధరించండి, భౌతిక దూరం పాటించండి, గుంపులుగా కలవకండి, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి, కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానం వస్తే మీ దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టెస్ట్ ఉచితంగా చేయించుకోండి ” అంటూ ఆయన కోరారు. ఇక ఈరోజు మధ్యాహ్నం మోడీతో సమావేశంలో కరోనా వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ శాస్త్రీయంగా ఆమోదింపబడిన వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ వెల్లడించారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.