చెరకు తోటలో చిరుతపులి పిల్లలు లభ్యం

చెరకు తోటలో చిరుతపులి పిల్లలు లభ్యంమెదక్​ జిల్లా హవేళీ ఘనపూర్​ మండలం సుల్తాన్​పూర్​లోని చెరకు తోటలో సోమవారం చిరుతపులి పిల్లలు కనిపించాయి. ఈ విషయమై సంబంధిత తోట యజమాని, గ్రామస్తలు ఫారెస్టు శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన వెళ్ళి వాటిని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారి శ్రీనివాస్​ నాయక్​ మాట్లాడుతూ… సుల్తాన్​పూర్​తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, గొర్రెల కాపరులు పది రోజుల వరకు అడవిలోకి వెళ్ళరాదని సూచించారు. ఈ విషయం తెలిసిన ఆయా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.