మహబూబ్ నగర్ జిల్లా: మాజీ రెవెన్యూ శాఖ మంత్రి కమతం రాంరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం ఉదయం ఆయన స్వగ్రామం గండీడ్ మండలం మహమ్మదాబాద్ గ్రామంలో తుదిశ్వాస విడిచారు.. కమతం రామిరెడ్డి మృతిపై సీఎం కెసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే రామిరెడ్డి మృతిపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యలకు సానుభూతి తెలిపారు.