మహాకవి దోర్బల విశ్వనాథశర్మ అస్తమయం

మహాకవి దోర్బల విశ్వనాథశర్మ అస్తమయంహైదరాబాద్: మహాకవి దోర్బల విశ్వనాథశర్మ(90) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్​లో మృతిచెందారు. 1931 లో అప్పటి మెదక్ జిల్లా రామాయంపేటలో జన్మించిన శర్మ సంస్కృతాంధ్రభాషలలో అపారపాండిత్యాన్ని సంపాదించి లబ్ధప్రతిష్ఠులయ్యారు.ఆయన రచించిన ‘శ్రీలాలిత్యం’ అశేషపాఠకాభిమానులను అలరించింది .రాష్ట్ర ప్రభుత్వం ఆయనను విశిష్ట సేవాపుర స్కారంతో సత్కరించింది. అంతేకాకుండా ఆయన ఎన్నో జాతీయ స్థాయి రాష్ట్రస్థాయి పురస్కారాలను, సత్కారాలను పొందారు.. వారి మృతి యావత్తు తెలంగాణ రాష్ట్రానికే కాకుండా తెలుగు నేలలకు తీరని లోటని పలువురు విచారం వ్యక్తం చేసి ప్రగాఢనివాళులు ఆర్పించారు. దర్శనమ్ ఆధ్యాత్మక వార్తా మాసపత్రిక, తెలంగాణ విద్వత్సభ బ్రహ్మశ్రీ దోర్బల విశ్వనాథ శర్మ గారికి శ్రద్ధాంజలి ఘటించింది.