రాజస్థాన్ : నటుడు నాగబాబు లవ్లీ డాటర్ నిహారిక పెళ్లి వేడుకలు అంగరంగ వైభరంగా జరుగుతున్నాయి. ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ హోటల్ లో నిహారిక పెళ్లి వేడుకలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి సంగీత్ వేడులు జరుగగా, మంగళవారం రాత్రి మెహందీ వేడుకలు జరిగాయి. డిసెంబర్ 09 బుధవారం రాత్రి 7గంటల 15 నిమిషాలకు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి రాజస్థాన్ లోని ఉదయపూర్ కోటలో అంగరంగ వైభవంగా జరుగనుంది.ఈ వేడుక కోసం రెండ్రోజుల ముందు మెగా కుటుంబ సభ్యులు అందరూ ఉదయపూర్ చేరుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఆయన తనయుడు అఖీరాతో కలిసి మంగళవారం రాత్రి ఉదయపూర్ చేరుకుని నిహారిక మెహందీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక బంగారు కోడిపెట్ట పాటకు చిరంజీవి-సురేఖ, బన్నీ స్టెప్పులేయగా, రామ చిలకమ్మ పాటకు అల్లు అరవింద్-నిర్మల దంపతులు డ్యాన్స్ లు చేసి అందరిలో హుషారును నింపారు. గ్యాంగ్ లీడర్ పాటకు నాగబాబు, నిహారిక- చైతన్య డ్యాన్స్ చేసి అదరగొట్టారు.
https://www.youtube.com/watch?v=CjMLnMprpMc