ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య జమ్మూకాశ్మీర్​ పుల్వామాలోని టికెన్​ ప్రాంతంలో బుధవారం తెల్లవారు జామున ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఎన్​కౌంటర్​లో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు మృతిచెందారు. టికెన్​​ ప్రాంతంలో తెల్లవారుజామున జమ్మూకాశ్మీర్​ పోలీస్​ 182 బెటాలియన్​ సీఆర్పీఎఫ్​, రాష్ట్రీయ రైఫిల్స్​, స్పెషల్​ఆపరేషన్​ గ్రూప్​ జాయింట్​ దళాలు సెర్చ్​ ఆపరేషన్స్​ నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో అదే ప్రాంతంలో దాగి ఉన్న ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. ఇంకా అక్కడ భద్రతా బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ను కొనసాగిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.