బురఖాతో కిడ్నాప్ ప్లాన్

బురఖాతో కిడ్నాప్ ప్లాన్గుంటూరు జిల్లా: నగరంలో పిల్లల కిడ్నాప్ ముఠా కలకలం రేపుతోంది. గుజ్జనగుండ్లలో ఓ బాలుడిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయగా ఆ బాలుడు తప్పించుకున్నాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే స్థానిక ఉద్యోగనగర్ ఆర్చీ వద్దకు వచ్చిన దుండగుల్లో ఓ మగ వ్యక్తి బురఖా ధరిస్తుండగా మున్సిపల్ కార్మికులు గుర్తించారు. అనుమానం వచ్చిన మున్సిపల్ కార్మికులు ఆ ఇద్దరు వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న సంచిలో కత్తులు, తాళ్లు, గ్లౌజ్‌లు లభ్యమవడంతో భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానితులను పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాగా అనుమానిస్తున్నారు. అనుమానితులిద్దరూ మాచర్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.