నాని ‘అంటే.. సుంద‌రానికీ!’

నాని, వివేక్ ఆత్రేయ‌, మైత్రి మూవీ మేక‌ర్స్ మూవీ టైటిల్‌ ‘అంటే.. సుంద‌రానికీ!’నాని 'అంటే.. సుంద‌రానికీ!'హైదరాబాద్‌: ఒక యాక్ట‌ర్‌గా ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేస్తున్న‌ప్ప‌టికీ, ప‌క్కింట‌బ్బాయి త‌ర‌హా పాత్ర‌లతో నేచుర‌ల్ స్టార్ నాని ప్రేక్ష‌కుల్లో అమిత‌మైన ఆద‌రాభిమానాల‌ను సంపాదించుకున్నారు. లేటెస్ట్‌గా ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌తో ఆయ‌న ఓ చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌లో నానికి ఉన్న ఆద‌రాభిమానాల‌కు త‌గ్గ‌ట్లుగా #నాని28 చిత్రానికి ‘అంటే.. సుంద‌రానికీ!’ అనే ఆస‌క్తిక‌ర టైటిల్ ఖ‌రారు చేశారు. ఒరిజిన‌ల్ స్టోరీతో మ్యూజిక‌ల్ రొమ్‌-కామ్‌గా ఈ సినిమా రూపొందుతోంది. టైటిల్ అనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా చిత్ర బృందం విడుద‌ల చేసిన వీడియో క్రేజీగా ఉంద‌ని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. టైటిల్ రోల్‌లో నాని లుక్ కొత్త‌గా ఉంద‌నీ, టైటిల్ ఆస‌క్తిక‌రంగా ఉంద‌నీ అంటున్నారు. ఆ వీడియో ప్ర‌కారం ఈ మూవీలో హిలేరియ‌స్ సీన్స్‌కు కొద‌వ ఉండ‌ద‌ని అర్థ‌మ‌వుతుంది.

త్వ‌ర‌లో చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానున్న ‘అంటే.. సుంద‌రానికీ!’ సినిమా 2021లో ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని పంచ‌నుంద‌నేది స్ప‌ష్టం. నాని స‌ర‌స‌న నాయిక‌గా న‌టిస్తుండ‌టం ద్వారా మ‌ల‌యాళం తార న‌జ్రియా ఫ‌హాద్ తెలుగు చిత్ర‌సీమ‌లోకి అడుగుపెడుతున్నారు. వివేక్ ఆత్రేయ మునుప‌టి చిత్రాల‌కు ఇంప్రెసిప్ మ్యూజిక్ అందించిన వివేక్ సాగ‌ర్ ఈ చిత్రానికీ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ర‌వితేజ గిరిజాల ఎడిట‌ర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి ప‌నిచేసే మిగ‌తా తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

హీరో హీరోయిన్లు: నాని, న‌జ్రియా ఫ‌హాద్‌

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: వివేక్ ఆత్రేయ‌
నిర్మాత‌లు: న‌వీన్ యెర్నేని, ర‌విశంక‌ర్ వై.
బ్యాన‌ర్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌
సీఈవో: చెర్రీ
మ్యూజిక్‌: వివేక్ సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: నికేత్ బొమ్మి
ఎడిటింట్‌: ర‌వితేజ గిరిజాల‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ల‌తా త‌రుణ్‌