రామ్‌ల‌ల్లాకు మోదీ సాష్టాంగ న‌మ‌స్కారం

రామ్‌ల‌ల్లాకు మోదీ సాష్టాంగ న‌మ‌స్కారంల‌క్నో: అయోధ్య‌లోని రామ్‌ల‌ల్లాను ప్ర‌ధాని మోదీ ఇవాళ ద‌ర్శించుకున్నారు. రామ్‌ల‌ల్లా ఆల‌యానికి చేరుకున్న మోదీ తొలుత సాష్టాంగ న‌మ‌స్కారం చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న శ్రీరాముడికి పువ్వుల‌తో పూజ స‌మ‌ర్పించారు. రామాల‌య నిర్మాణం సంద‌ర్భంగా భూమిపూజ‌లో పాల్గొనేందుకు మోదీ అయోధ్య‌కు చేరుకున్నారు. సాంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో మోదీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. రామ్‌లల్లా విగ్ర‌హ‌మూర్తి చుట్టూ మోదీ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు.