పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు: కేటీఆర్​

పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు: కేటీఆర్​ రాజన్న సిరిసిల్ల జిల్లా : పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి కేటీఆర్​ అన్నారు. గురువారం సిరిసిల్ల పర్యటన సందర్భంగా మంత్రి పట్టణంలో నిర్మించిన పార్టీ కార్యాలయం ప్రగతిభవన్​ను సందర్శించారు. అనాథ వృద్ధులను ఆదుకోనేందుకు నియోజకవర్గంలో మండలానికో వృద్ధాశ్రమాన్ని సొంత ఖర్చులతో నిర్మించనున్నట్లు తెలిపారు. సిరిసిల్ల విద్యుత్​ సంస్ధ సహకార ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయన వెంట టెస్కాబ్​ చైర్మన్​ కొండూరి రవీందర్​రావు నాయకులు పాల్గొన్నారు.

పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు: కేటీఆర్​