23 నుంచి `సీటీమార్‌` షూటింగ్ పునః ప్రారంభం

23 నుంచి `సీటీమార్‌` షూటింగ్ పునః ప్రారంభంహైద‌రా‌బాద్: ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ `సీటీమార్‌. పవన్‌ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్‌కి ముందే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ‌లాక్‌డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డ్డ షూటింగ్‌ న‌వంబ‌ర్ 23 నుండి ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో సినిమా ని కంప్లీట్ చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ చిత్రానికి..
సినిమాటొగ్ర‌ఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌,
సంగీతం: మణిశర్మ‌,
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,
ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై,
సమర్పణ: పవన్‌ కుమార్‌,
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి,
కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.