సిరీస్​ రద్దు

సిరీస్​ రద్దుకేప్​టౌన్ ​: ఇంగ్లండ్​, సౌతాఫ్రికా మధ్య జరుగనున్న వన్డే సిరీస్​ కోవిడ్​ కారణంగా రద్దయింది. మొదట వాయిదాలు, తర్వాత మ్యాచ్​ల రద్దు అనంతరం ఏకంగా మొత్తం సిరీస్​నే రద్దు చేయాలని రెండు బోర్డులు నిర్ణయించాయి. ఈ క్రమంలో ఆటగాళ్లు వైరస్​ బారిన పడకుండా పెట్టిన బయోబబుల్​లోనూ కరోనా కేసులు నమోదవడంతో సిరీస్​ను రద్దు చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు. రెండు జట్ల ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు రెండు బోర్డులు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంచేశాయి. భవిష్యత్​లో ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ మూడు వన్డేల సిరీస్​ను ప్రారంభించాలని రెండు బోర్డులు అభిప్రాయపడ్డాయి. మొదటి వన్డేకు ముందు ఓ సౌతాఫ్రికా ఆటగాడికి పాజిటివ్​ తేలిందన్న సమాచారంతో ఈ గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో మొదటి వన్డేను వాయిదా వేసి ఆతర్వాత రద్దు చేశారు. అలాగే రెండో వన్డేకు ముందు ఇద్దరు ఆటగాళ్లకు కూడా పాజిటివ్​ అని తేలడంతో ఈ మ్యాచ్​ను సైతం వాయిదా వేశారు. ఈ పరిస్థితుల్లో టూర్​ మొత్తాన్నే వాయిదా వేయడం మేలని రెండు జట్లు నిర్ణయించాయి.