టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీంఇండియా

న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు మూడో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ నిర్వహించగా, భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు వన్డేలు పూర్తవగా రెండింటిలోనూ దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఈ వన్డేలో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భారత్ కసి మీద ఉంది. అదే టైంలో భారత్ ను మూడో వన్డేలోనూ ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని దక్షిణాఫ్రికా ఉవ్విళ్లూరుతుంది.