హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ వరద బాధితులకు ఆర్ధిక సాయం చేస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం యథావిధిగా వరద సాయం కొనసాగుతుందని చెప్పిన సీఎం.. ఆ మేరకు ఇప్పుడు బాధితుల ఖాతాల్లో నగదు జమ చేయిస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్‌లో 10 వేల కుటుంబాలకు వరదసాయం అందజేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. 10 వేల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.10 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. వారం రోజుల్లో మొత్తం 48,232 మంది బ్యాంకు ఖాతాల్లో వరద సాయం జమ చేయనున్నట్లు చెప్పారు.