ఆకలిని తరిమేద్దామంటోన్న సోనమ్ కపూర్

ఆకలిని తరిమేద్దామంటోన్న సోనమ్ కపూర్ముంబయి: ఆకలిని అంతం చేసే పోరులో అందరూ భాగస్వాములు కావాలని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన అభిమానులను కోరారు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్ పీ)2020 నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకుంది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితికి సోనమ్ శుభాకాంక్షలు తెలిపింది. “మిషన్ టు ఎండ్ హంగర్” అనే ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు ఇవ్వాలని తన అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. ‘ఆకలి లేని సమాజాన్ని నిర్మించడం ప్రస్తుతం మన ముందున్న పెద్ద సవాల్. కానీ..మనందరం కలిస్తే ప్రతీ రోజు ఆకలితో పడుకునే 690 మిలియన్ల మంది జీవితాల్లో మార్పు తీసుకురాగలం’ అని డబ్ల్యూఎఫ్ పీ పేర్కొంది. ప్రతీ ఏడాది 80కి పైగా దేశాల్లో 100 మిలియన్ల మందికి భోజనం అందిస్తున్నట్లు వివరించింది. గమ్యాన్ని చేరడంలో సోనమ్ కపూర్ అందిస్తున్న సహకారాన్ని డబ్ల్యూఎఫ్ ఫీ ప్రత్యేకంగా గుర్తు చేసి, తన పాత్రను సైతం కొనియాడింది. సోనమ్ కపూర్ చివరగా 2019 లో ‘ది జోయా ఫాక్టర్ ‘ సినిమాలో కనిపించింది. అందులో ఆమె దుల్కర్ సల్మాన్ కు జోడీగా నటించింది. ప్రస్తుతం అనిల్ కపూర్ హీరోగా ‘ ఏకే వర్సెస్ ఏకే’ చిత్రంలోనూ సోనమ్ నటిస్తోంది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.