భద్రాద్రి సీతారాముల కల్యాణ తేది ఖరారు
వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : భద్రాద్రి సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయ వైదిక కమిటీ శ్రీరామనవమి ముహూర్తాన్ని ఖరారు చేసింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు శ్రీరామనవమి తిరు కల్యాణ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మార్చి 31న నిర్వహించేందుకు వైదిక కమిటీ ఖరారు చేసింది. మార్చి 31న పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.