ట్రాఫిక్​ పోలీసుల ఔదార్యం

ట్రాఫిక్​ పోలీసుల ఔదార్యంవరంగల్​ అర్బన్​: ట్రాఫిక్​ పోలీసులు ఔదార్యం చూపారు. పర్సు పోగొట్టుకున్నవ్యక్తి కి తిరిగి పర్సును అప్పగించారు. మంగళవారం అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించేందుకు పోలీస్ వాహనంలో వరంగల్ ట్రాఫిక్ ఎస్సై ఫసీయుద్దీన్ బయలు దేరారు. ఈ క్రమంలో రోడ్డుపై పడివున్న పర్సును గమనించి పరిశీలించారు. అందులో కొంత డబ్బు డ్రైవింగ్, డెబిట్​ , క్రెడిట్ కార్డు ఉన్నట్లు గుర్తించారు. పర్సులోని సమాచారం ఆధారంగా వివిధ సామాజిక మాధ్యమాల్లో వివరాలను పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న శివనగర్ కు చెందిన రాంకుమార్ పోలీసులను సంప్రదించారు. దీంతో వివరాలు తెలుసుకుని ఆయనకు పర్సును అందజేశారు. ఈ సందర్భంగా రాంకుమార్​ ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.