25న చిత్తూరు జిల్లాకు సీఎం జగన్‌

చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన ఖరారైంది. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని జిల్లా నుంచే ప్రారంభిస్తారు. అందులో భాగంగానే ఈ నెల 25న సీఎం జగన్‌ జిల్లాకు రానున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకర్గాల్లో ఏదో ఒకచోట కార్యక్రమం ఉండే అవకాశం ఉంది. ఏర్పేడు సమీపంలోని చిందేపల్లిని అధికారులు పరిశీలిస్తున్నారు.
దేశ చరిత్రలోనే ప్రథమం : దేశ చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా ఒకేసారి 30.66 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చంద్రబాబు తన మనుషులతో కోర్టులో కేసులు వేయించి, స్టేలు తెచ్చి 3,65,680 ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు. దీంతో ఈ నెల 25న 27 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు. 11 వేలకు పైగా పంచాయతీల్లో 17,436 వైఎస్సార్‌-జగనన్న కాలనీలు కనిపించబోతున్నాయి. ప్రతి పేద వాడికి సెంటున్నర స్థలం. పట్టణాల్లో అయితే సెంటు స్థలం. ఇప్పుడు మనం 68,677 ఎకరాలు పంపిణీ చేస్తున్నాం. ఇందులో 25,359 ఎకరాల ప్రైవేట్‌ భూములను రూ.10,150 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగిలినవి ప్రభుత్వ భూములు. మొత్తంగా ఈ భూముల మార్కెట్‌ విలువ రూ.23,535 కోట్లు. అంత విలువ చేసే భూములను 30.66 లక్షల మంది పేదలకు పంచుతున్నారు.