సీఎం జగన్​ పర్యటన ఏర్పాట్లు పరిశీలన

సీఎం జగన్​ పర్యటన ఏర్పాట్లు పరిశీలన

కృష్ణాజిల్లా : జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్ళపాడు గ్రామంలో ఈ నెల 21న సీఎం వైఎస్​ జగన్ “వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష” పథకం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం తక్కెళ్లపాడు గ్రామ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను , కృష్ణాజిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, సబ్ కలెక్టర్ ధ్యాన చంద్రతో మంత్రి పేర్ని నాని సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీమతి గెంటేల శకుంతలమ్మ కళాశాల ఆవరణలో సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్య పేట పట్టణ అధ్యక్షుడు చోడవరపు జగదీశ్​, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుకూరు శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు తన్నీరు నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంజం కేశవరావు వూట్ల నాగేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు.