మరోసారి సత్తాచాటిన ఏపీ పోలీస్​ శాఖ

అమరావతి : ఐసీజేఎస్​( ఇంటర్​ ఆపరేబుల్​ క్రిమినల్​ జస్టిస్​ సిస్టమ్​) అమలు చేయడం, వినియోగంలో ఏపీ పోలీస్​శాఖ మరోసారి సత్తా చాటింది. జాతీయస్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. కాగా మహారాష్ట్ర మొదటిస్థానం, తెలంగాణ మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇందుకు సంబంధించిన అవార్డును మంగళవారం డీజీపీ గౌతమ్​సవాంగ్​ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి చేతులమీదుగా ఆన్​లైన్​ ద్వారా అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన అవార్డు ను పోలీస్ శాఖ దక్కించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సీఎం వైఎస్​ జగన్​ హోం మంత్రి మేకతోటి సుచరిత పోలీస్​శాఖను అభినందించారు.