బీజేపీ ప్రచారంలో అపశృతి

బీజేపీ ప్రచారంలో అపశృతిశ్రీనగర్ : బీజేపీ ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. జమ్ముకశ్మీర్ లోని ప్రసిద్ధ దాల్ సరస్సులో పడవలపై ప్రచారం చేస్తుండగా ఒక పడవ తిరగబడింది. దీంతో నీళ్లల్లో పడిన నలుగురు బీజేపీ నేతలు, మీడియా సిబ్బందిని స్థానికులు , రెస్క్యూ టీంలు, పోలీసులు కాపాడారు. జమ్మూకశ్మీర్ లో జిల్లా అభివృద్ధి మండళ్ల(డీడీసీ)కు దశల వారీగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనగర్ లోని ప్రసిద్ధ దాల్ సరస్సులో పర్యాటకులు విహరించే పడవలైన షికారాలపై బీజేపీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. అందులో ఒక పడవ ఒడ్డుకు సమీపిస్తుండగా బోల్తాపడింది. దీంతో అందులో వున్న నలుగురు బీజేపీ నేతలు, పలు మీడియా సంస్థలకు చెందిన సిబ్బంది నీళ్లలో పడ్డారు. రెస్క్యూ టీం , పోలీసులు , స్థానికులు కలిసి వెంటనే వారిని కాపాడారు. అందరూ ప్రాణాలతో బయటపడటంతో నేతలు ఊపిరిపీల్చుకున్నారు. కాగా డీడీసీ ఆరో దశ పోలింగ్ జరిగింది.