రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి..మరొకరికి తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి..మరొకరికి తీవ్రగాయాలుములుగు జిల్లా : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ములుగు మండలం మల్లంపల్లి గ్రామం వద్ద గల 163 జాతీయ రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం నల్లబెల్లి మండలం సాయిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కొండయ్య తన తల్లితో కలిసి ద్విచక్రవాహనంపై హనుమకొండకు వెళ్తున్నారు.

ఈక్రమంలో గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీకొనడంతో కొండయ్య అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి తీవ్రంగా గాయపడింది. ఈక్రమంలోనే పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తిరుగు ప్రయాణంలో హనుమకొండకు వెళ్తున్నాడు. మార్గం మధ్యలో రోడ్డు ప్రమాద ఘటనా స్థలం వద్ద ఆగారు. క్షతగాత్రులను 108 ద్వారా వరంగల్ ఎంజీఎంకు తరలించారు.