‘777 ఛార్లి’ జూన్ 10న గ్రాండ్ రిలీజ్‌

 ‘777 ఛార్లి’ జూన్ 10న గ్రాండ్ రిలీజ్‌

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి మ‌రో విభిన్న‌మైన క‌థా చిత్రం ‘777 ఛార్లి’తో ఆడియెన్స్‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ జూన్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ లెవ‌ల్లో విడుద‌ల‌వుతుంది.'777 ఛార్లి' జూన్ 10న గ్రాండ్ రిలీజ్‌ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ర‌క్షిత్ శెట్టి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తూ జి.ఎస్‌. గుప్తాతో క‌లిసి త‌న ప‌ర‌మ్ వ‌హ్ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మించారు. కిర‌ణ్ రాజ్‌.కె ద‌ర్శ‌కుడు. శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర‌ యూనిట్ ప్ర‌క‌టిస్తూ రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

ఛార్లి అనే కుక్క పిల్ల అనుకోని ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వ‌చ్చి ఇబ్బంద‌లు ప‌డిన‌ప్పుడు ధ‌ర్మ అనే వ్య‌క్తిని ఎలా క‌లుసుకుంది. వారి మ‌ధ్య అనుబంధం ఎలా ఏర్ప‌డింది. చివ‌ర‌కు ఏం జ‌రిగింద‌నే విష‌యాల‌ను 777 ఛార్లి అనే అడ్వెంచర‌స్ కామెడీలో చూపించ‌బోతున్నారు.

న‌టీన‌టులు :
ర‌క్షిత్ శెట్టి, సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం :
బ్యాన‌ర్‌ : ప‌ర‌మ్ వ‌హ్ స్టూడియోస్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : కిర‌ణ్ రాజ్‌.కె
నిర్మాత‌లు : జి.ఎస్‌.గుప్తా, ర‌క్షిత్ శెట్టి
సంగీతం : నోబిన్ పాల్‌
సినిమాటోగ్ర‌ఫీ : అర‌వింద్ ఎస్‌.క‌శ్య‌ప్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైనర్ : ఉల్లాస్ హైదుర్‌
ఎడిట‌ర్‌ : ప్ర‌తీక్ శెట్టి
డైలాగ్స్‌ : కిర‌ణ్ రాజ్.కె, రాజ్ బి.శెట్టి, అభిజీత్ మ‌హేశ్‌, కె.ఎన్‌.విజ‌య్ కుమార్ (తెలుగు)
స్టంట్స్‌ : విక్ర‌మ్ మోర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌ : బినాయ్ కందేల్‌వాల్‌, సుధీ డి.ఎస్‌
కాస్ట్యూమ్స్ : ప్ర‌గ‌తి రిష‌బ్ శెట్టి
కానినె ట్రైన‌ర్ : ప్ర‌మోద్ బి.సి
పి.ఆర్‌.ఒ : వంశీ కాక‌