భారీగా పట్టుబడిన అంబర్

భారీగా పట్టుబడిన అంబర్వరంగల్ అర్బన్ జిల్లా: హన్మకొండ ఎక్సైజ్ కాలనీకి చెందిన ముక్క సంపత్ కుమారుడు ముక్క శ్రీకాంత్ అనే వ్యక్తి ప్రభుత్వ నిషేదిత అంబర్ బ్యాగులను బీదర్ నుంచి తెప్పించుకున్నాడనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ముక్క శ్రీకాంత్ ఇంటిపై దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ అదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది హన్మకొండ ఎక్సైజ్ కాలనీలోని ముక్క శ్రీకాంత్ ఇంటికి వెళ్లి చూడగా తన ఇంటి ముందు వున్న ఒక ఇటియోస్ కారు (AP-02-AT-7460)లో అంబర్ ప్యాకెట్లు కలిగిన 12 బ్యాగులను పరిశీలించారు. అట్టి బ్యాగులపై కారు డ్రైవర్ ను ఆరా తీసిన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అసలు విషయం తెలిసింది. ఖమ్మం జిల్లా పాండురంగాపురంకు చెందిన అహ్మద్ అంజద్ తన ఇటియోస్ కారును ట్రావెల్స్ కు వుపయోగిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి తెలిపాడు. అదే క్రమంలో శ్రీకాంత్ అనే వ్యక్తి బీదర్ నుంచి తనను అంబర్ బ్యాగులు తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. శ్రీకాంత్ కోరిక మేరకు అంబర్ బ్యాగులు తీసుకొచ్చినట్లు చెప్పిన అహ్మద్ అంజద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముక్క శ్రీకాంత్ పరారీలో వున్నాడు.. నేరస్తుడు అహ్మద్ అంజద్ నుంచి రూ.6 లక్షల విలువ చేసే 12 బ్యాగుల అంబర్ ప్యాకెట్లను, ఇటియోస్ కారును స్వాధీన పరుచుకుని ఫుడ్ సేఫ్టీ అధికారికి అందించారు.