జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్లదాడి

జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్లదాడిడైమండ్ హార్బర్ (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అ‌ధ్యక్షుడు జేపీ నడ్డాకు ఛేదు అనుభవం ఎదురైంది.కోల్ కతాలోని డైమండ్ హార్బర్ కు వెళ‌్తుండగా జేపీ నడ్డా కాన్వాయ్ పై కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఆందోళనకారులు ర‌హదారిని నిర్భంధించి నడ్డా కాన్వాయ్ ను అడ్డుకున్నారు. వారు వాహనాలపై రాళ‌్లు, కర్రలతో దాడి చేసినట్లు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. దాడి చేసిన వారు తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ ఘటనలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గియా కారు ధ‌్వంసమైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ బెంగాల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు దిలీప్ ఘోష్ లేఖ రాశారు. నడ్డా పర్యటనలో తీవ్రమైన భద్రతా లోపాలున్నాయని తెలిపారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని దిలీప్ ఘోష్ లేఖలో పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నడ్డా నిన్న కోల్ కతా వెళ్లారు. డైమండ్ హార్బర్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మరికొన్ని నెలల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ బలోపేతానికి బీజేపీ తీవ్రంగా కృషిచేస్తోంది. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.