డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన సీఎం

డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన సీఎంసిద్దిపేట జిల్లా: సిద్దిపేట జిల్లా నర్సాపూర్ లో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పైలాన్ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించి, లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేయించారు. సుమారు 163 కోట్ల వ్యవయంతో 2460 ఇళ్ల సముదాయాన్ని నిర్మించారు. ఇందులో తొలివిడతగా 1341 ఇళ్లను సీఎం ప్రారంభించారు. సీఎం కేసీఆర్ సమక్షంలో 144 మంది గృహప్రవేశాలు చేశారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాతో పాటు కరెంట్ మీటర్ నంబర్ , వాటర్ కనెక్షన్ మార్పిడి పత్రం, ప్రాపర్టీ టాక్స్ , కామన్ అఫిడవిట్ ,వంట గ్యాస్ సంబంధిత పత్రాలను అందించారు.మిగిలిన 1119 ఇళ్లను దశలవారీగా అర్హులకు కేటాయించనున్నారు.