బిగ్​బాస్-4 విన్నర్​ అభిజిత్​

బిగ్​బాస్-4 విన్నర్​ అభిజిత్​

హైదరాబాద్​ : బిగ్​బాస్​ అభిమానులు ఎదురు చూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. వరంగల్​ టైమ్స్​ చెప్పినట్టుగానే బిగ్​బాస్​- 4 2020 సీజన్​ విజేతగా అభిజిత్​ నిలిచారు. సోషల్​ మీడియాలో ఓటింగ్ ఎక్కువశాతం అభిజిత్​కు ఉంది కనుక తనే విన్నర్​ అవుతాడని వరంగల్​ టైమ్స్​ ముందే ఊహించి చెప్పింది. వరంగల్​ టైమ్స్​ చెప్పినట్లుగానే బిగ్​బాస్​ సీజన్ 4​ లో అభిజిత్​ను విజయం వరించింది. రన్నర్ విషయం గురించి సోహైల్​, అరియానా , అఖిల్​లో ఎవరో ఒకరు ఉంటారని వరంగల్​ టైమ్స్​ చెప్పింది. అనుకున్నట్లుగానే అఖిల్​ రన్నర్​గా నిలిచారు. బంజారాహిల్స్​లోని అన్నపూర్ణ స్టూడియోలో ఉత్కంఠగా జరిగిన ఈ షోలో అభిజిత్​ చేయిని, అఖిల్ చేయిని పైకి లేపిన నాగార్జున ఐదు నిమిషాల అనంతరం అఖిల్ చేతిని డౌన్ చేసి అభిజిత్  చేయిని పైకి ఉంచి విజేతగా ప్రకటించాడు. తనను విజేతగా ప్రకటించడంతో అభిజిత్​ హౌస్​లో ఒక్కసారిగా ఉత్కంఠకు లోనయ్యాడు. తన కళ్లలో ఆనంద భాష్పాలు వచ్చాయి.  అభిజిత్, అఖిల‌్ కు అక్కినేని నాగార్జున కంగ్రాట్స్​ తెలిపారు. ఇక విజేతగా నిలిచిన అభిజిత్​కు మెగాస్టార్​ తన చేతుల మీదుగా బహుమతిని అందించి అభినందించాడు. మెగాస్టార్ చేతుల మీదుగా బహుమతి తీసుకునేముందు అభిజిత్​ మెగాస్టార్​కు పాదాభివందనం చేసి చిరును హగ్​ తీసుకున్నాడు. అనంతరం మెగాస్టార్​, నాగార్జున చేతుల మీదుగా రూ.25 లక్షల చెక్ ను అందుకున్నాడు. ఈ సన్నివేశాన్ని చూస్తూ ఎదురుగా తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు,స్నేహితులు ఆనందానికి గురయ్యారు. మరోపక్క టీవీలో బిగ్​బాస్​ షో చూస్తున్న అభిజిత్​ అభిమానులు టీవీల ముందు సంబురాలు చేసుకున్నారు. బిగ్​బాస్​ విజేత అభిజిత్​, రన్నర్​ అఖిల్​కు వరంగల్​ టైమ్స్​(warangaltimes) తరపున కంగ్రాట్స్​.