సాక్షి టీవీలోకి బిత్తిరి సత్తి

హైద‌రాబాద్: నిజమ బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి కుమార్ సాక్షి టీవీలో చేరుతున్నాడు. తనతోపాటు టీవీ9 నుంచి బయటికొచ్చిన ఇస్మార్ట్ న్యూస్ టీం మెంబర్ కుమార్ కూడా తనతోపాటు ప్రొడ్యూసర్ రైటర్‌గా సాక్షిలోకి అడుగుపెడుతున్నాడు. వీ6 తీన్మార్ న్యూస్ నుంచి సత్తి టీవీ9 చానెల్‌లోకి రావడం, అక్కడ ఇస్మార్ట్ న్యూస్‌లో వర్క్ చేయడం, ఈమధ్య ఓ గొడవ చోటుచేసుకుని, ఆ ఇద్దరూ బయటికి రావడం అందరికీ తెలిసిందే. అయితే చానెళ్లలో ఇవన్నీ సహజంగానే జరుగుతూనే ఉంటయి. రెగ్యులర్ న్యూస్ డివిజన్లలో వర్క్ చేసేవాళ్లు గాకుండా, కొంత క్రియేటివ్ వర్క్ చేసే వాళ్లు అటూఇటూ మారుతూనే ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశాలు కొన్ని ఉన్నయి, అవి ఏమిటంటే..? రవిప్రకాష్ ఉన్నప్పుడు టీవీ9 ఇదే సత్తిని వీ6 నుంచి లాగడానికి బాగా ప్రయత్నించింది. తీరా ఇప్పుడు తనే వదులుకుంది. ప్రస్తుతం తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్ ఓసారి జాగ్రత్తగా పరిశీలిస్తే..టాప్‌లో ఉన్న వాటిల్లో టీవీ9 ఇస్మార్ట్ న్యూస్, టీవీ5 మాస్ మల్లన్న, వీ6 తీన్మార్ న్యూస్, హెచ్ఎంటీవీ జోర్దార్ వార్తలు, టీన్యూస్ ధూంధాం ముచ్చట. ఇవే ఆయా చానెళ్ల రేటింగ్స్‌ను శాసిస్తున్నయి. ఆయా చానెళ్ల పర్‌ఫామెన్స్‌ను విడివిడిగా చూస్తే, ప్రతి చానెల్ టాప్ 30 ప్రోగ్రామ్స్‌లో ఇవే పైన కనిపిస్తూ ఉంటయి.

సాక్షి టీవీలోకి బిత్తిరి సత్తి

వీటిల్లో ఒక్క టీవీ5 తప్ప మిగతావన్నీ తెలంగాణ ఓనర్లవే.. తెలంగాణ, ఏపీల్లో ప్రసారాలు ఉన్నా సరే.. ఈ ప్రోగ్రాములన్నీ తెలంగాణ యాసలో.. ప్రధానంగా సెటైర్ బేస్డ్.. వీటిని ఒక్క తెలంగాణ జనంలోనికే గాకుండా ఏపీ ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తారు. అందుకే ఆ రేటింగ్స్.. అయితే ఏబీఎన్, ఈటీవీ, సాక్షి, ఎన్టీవీ వంటి చానెళ్లకు ఈతరహా ప్రోగ్రాములేమీ లేవు. అవి నిఖార్సుగా న్యూస్ బులెటిన్లపైనే ఆధారపడుతున్నాయి. రేటింగ్స్ కోసం.. పార్టీలవారీగా అతిథులు వాదులాడుకునే డిబేట్లు గట్రా రేటింగ్స్ బరిలో పనికిరావు.

సాక్షి విషయానికొస్తే.. స్థూలంగా ఏపీ, తెలంగాణ, హైదరాబాద్ మార్కెట్లు కలిస్తే, బార్క్ రేటింగ్స్‌లో కాస్త బెటర్ పొజిషన్‌లోనే ఉన్నా. కేవలం హైదరాబాద్ సిటీ మార్కెట్ పరంగా పూర్ పర్‌ఫామెన్స్ కనిపిస్తోంది. కొన్నిసార్లయితే మరీ ఏడు, ఎనిమిది స్థానాలకు పడుతూ లేస్తూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ రవి, కుమార్ గనుక ఓ మంచి టీం ఏర్పాటు చేసుకుని, ఓ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే అది సాక్షి టీవీకి బూస్టపే. వీళ్లకూ నయమే..ఎటొచ్చీ అది వైసీపీ అధినేత జగన్ చానెల్ గనుక ఆ పొలిటికల్ లైన్ దాటకుండా ఉంటే చాలు. సాక్షిలో గనుక వీళ్ల ప్రోగ్రాం క్లిక్కయితే ఏబీఎన్, ఈటీవీ, ఎన్టీవీ కూడా ఇలాంటి ప్రోగ్రాం కోసం ఆలోచించాల్సిన స్థితి ఏర్పడవచ్చు. ఎన్టీవీ కాస్త నయం..ఈటీవీ న్యూస్ చానెల్స్, ఏబీఎన్ రేటింగ్స్ జాబితాలో మరీ ఎక్కడో కింద కనిపిస్తున్నాయి. వాటికన్నా టెన్‌టీవీ బెటర్ పొజిషన్‌లో ఉంటోంది పలుసార్లు. సో, బెస్టాఫ్ లక్ బ్రదర్స్.