‘బిగ్‌బాస్ సీజన్ 4’కు హోస్ట్‌గా విజయ్ దేవరకొండ

హైదరాబాద్‌: కరోనా వైరస్ వాప్తి కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇటీవల రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో ఇప్పడిప్పుడే షూటింగ్‌లు మొదలవుతున్నాయి. కానీ, కరోనా కేసులు పెరుగుతుండడంతో ఎవరూ ధైర్యం చేయడం లేదు. టీవీ సీరియల్స్‌ కూడా ఆగిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలాంటి సమయంలో ‘బిగ్‌బాస్ సీజన్ 4’కు హోస్ట్‌గా విజయ్ దేవరకొండ‘బిగ్‌బాస్’ షో గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4’కు సంబంధించి ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ బయటికి వచ్చేసింది. ఇక హోస్ట్ విషయలో తారక్, సమంత, నాగ్ అంటూ వార్తలు వినిపించాయి. తాజాగా మరో హీరో విజయ్ దేవరకొండ పేరు కూడా వినబడుతుంది. సీజన్ 4కు సంబంధించి కంటెస్టెంట్స్ గురించి కాని హోస్ట్ గురించి కాని నిర్వాహకులు ఎలాంటి ప్రకటన చేయడం లేదు. కానీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిజంగా విజయ్ దేవరకొండ హోస్ట్‌గా చేస్తే ఈ షోకి మంచి క్రేజ్‌ వస్తుంది కానీ.. ఆయన సినిమా షూటింగ్‌కే వెళ్లలేక ఇంట్లో ఉంటే.. ఇక ఈ షోను ఎలా రన్ చేస్తాడనే దానిపై క్లారిటీ లేదు. ఈ విషయంలో బిగ్‌బాస్ నిర్వాహకులు క్లారిటీ ఇస్తే గానీ ఈ పుకార్లకు బ్రేక్‌ పడదు.