ప్రవేశాల గడువు పొడిగింపు

ప్రవేశాల గడువు పొడిగింపుహైదరాబాద్ : అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ (ఏంఎ., ఎంకామ్​, ఎమ్మెస్సీ , ఎంబీఏ (ఐసెట్​ ద్వారా), బీఎల్​ఐఎస్​సీ, ఎంఎల్​ఐఎస్​సీ, పీ.జీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి చివరి తేదీ డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఇన్​చార్జి రిజిస్ట్రార్ డాక్టర్​ జీ. లక్ష్మారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయ స్టడీ సెంటర్స్ లో ఆయాకోర్సుల్లో చేరడానికివిద్యార్హతలు,ఫీజు తదితర వివరాలను  www.braouonline.in లో పొందుపర్చినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియెట్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు, యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016 నుంచి 2020 వరకు పాసైన విద్యార్థులు కూడా నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చని సూచించారు. ఇప్పటికే అడ్మిషన్ పొంది ఉండి వివిధ కారణాలతో సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయిన డిగ్రీ కోర్సు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు, పీజీ కోర్సుల్లో చేరి అడ్మిషన్ ఫీజు సకాలంలో కట్టలేక పోయిన వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. బీటెక్​, బీఫార్మసీ, కోర్సులు చదవిన విద్యార్థలు కూడా ఓపెన్ వర్సిటీలో పీజీ కోర్సు ఎం.ఏ. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ సోషియాలజీ, ఇంగ్లిష్, సైకాలజీ, జర్నలిజం, కోర్సులలో అడ్మిషన్ పొందవచ్చని యూనివర్సిటీ అధికారులు తెలిపారు .మరిన్నివివరాలకు 7382929570/580/590/600 లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 040-23680333 / 555 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.