శ్రీలక్ష్మినరసింహస్వామి జాతరలో చల్లా ఫ్యామిలీ 

శ్రీలక్ష్మినరసింహస్వామి జాతరలో చల్లా ఫ్యామిలీ

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : పరకాల నియోజకవర్గం దామెర మండలం ఊరుగొండ గ్రామ శివారులో ప్రతీ యేడాది జరిగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఈ సారి కూడా ఘనంగా జరిగింది. ఈ జాతరను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబసమేతంగా సందర్శించారు. స్వయంభూగ వెలిసిన స్వామి వారికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి- జ్యోతి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషిచేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినందుకు ప్రజాప్రతినిధులను, అధికారులను అభినందించారు.శ్రీలక్ష్మినరసింహస్వామి జాతరలో చల్లా ఫ్యామిలీ జాతర ప్రాంగణంలో వీణ మెడికేర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన హాస్పిటల్ సిబ్బందిని చల్లా ధర్మారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల మరియు గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, మార్కెట్ చైర్మన్ , కమిటీ సభ్యులు, రైతు బంధు కన్వీనర్లు, కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.