జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బోణీ కొట్టిన కాంగ్రెస్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బోణీ కొట్టిన కాంగ్రెస్
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌లో సింగిరెడ్డి శిరీషా రెడ్డి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి లీడింగ్‌లో ఉంటూ వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చివరికి విజయం సాధించారు. అయితే ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారనే దానిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. శిరీష గెలవడంతో స్థానికంగా కాంగ్రెస్ కార్యాలయం, ఆమె నివాసం వద్ద కార్యకర్తలు, అనుచరులు పటాసులు పేల్చి స్వీట్లు పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఇంకా మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. గతంలో కంటే ఈసారి కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.