వరంగల్ రెడ్ క్రాస్ లో ఆరోగ్య శిబిరం

వరంగల్ రెడ్ క్రాస్ లో ఆరోగ్య శిబిరం

వరంగల్ అర్బన్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో హిందుస్థాన్ పెట్రోలియం ప్లాంట్ వర్కర్లకు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య శిబిరంలో ప్రథమ చికిత్సపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైనా ప్రమాదం జరిగి గాయాలైనప్పుడు, ఎముకలు విరిగినప్పుడు బాధితులకు చేసే ప్రథమ చికిత్స, కట్లు కట్టే విధానం, అపస్మారక స్థితిలోకి వెళ్లి గుండె ఆగినప్పుడు సిపిఆర్ పద్ధతి ద్వారా మళ్ళీ ఏ విధంగా పున‌:‌ప్రారంభించవచ్చు, కాలిన వ్యక్తులకు ఏ విధంగా ప్రథమ చికిత్స చేయాలి, గాయపడ్డ వ్యక్తులను ఏ విధంగా లిఫ్ట్ చేసి కాపాడాలి అనే ప్రథమ చికిత్స విధానాలను ప్రాక్టికల్ గా చేసి చూపించడంతో పాటు, వారితో ప్రయోగం చేయించారు. అదే విధంగా వర్కర్లకు ఆరోగ్య శిబిరంలో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కోఆర్డినేటర్ గా రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు డాక్టర్ టి.విజయలక్ష్మి, ప్రథమ చికిత్స శిక్షకుడు రమణ, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ జి.ప్రభాకర్ రావు, డాక్టర్ పెద్ది ప్రత్యూష, హిందుస్థాన్ పెట్రోలియం గ్యాస్ ప్లాంట్ ప్రతినిధులు ఈ.వి. సురేష్, గౌతమ్ క్రిష్ణ, శరత్ నేత్ర వైద్యశాల సిబ్బంది, రెడ్ క్రాస్ సిబ్బంది, గ్యాస్ ప్లాంట్ వర్కర్లు , తదితరులు పాల్గొన్నారు.