మత విద్వేశాలు రెచ్చగొట్టి గెలిచారు: రేవంత్​రెడ్డి

మత విద్వేశాలు రెచ్చగొట్టి గెలిచారు: రేవంత్​రెడ్డి

హైదరాబాద్​: బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎక్కువ సీట్లు గెలుపొందారని కాంగ్రెస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మల్కాజిగిరీ ఎంపీ రేవంత్​రెడ్డి విమర్శించారు. శుక్రవారం గ్రేటర్ ఫలితాలు వెలువడిన తరువాత ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి బీజేపీ అగ్రనేత​లు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు. అలాగే టీఆర్​ఎస్​ తరుపున మంత్రి కేటీఆర్​ గల్లీలో తిరిగాడన్నారు. రెండు పార్టీలు గెలుపుకోసం సర్వశక్తలు ఒడ్డాయన్నారు. తెలంగాణలో ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఛానెల్​ , పేపర్​ ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక రాజకీయపార్టీ ఒక ఛానెల్​ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కాంగ్రెస్​ పార్టీ ఓడిపోవడానికి ప్రధానం కారణం మీడియానే ఆయన ఎద్ధేవా చేశారు. తమకు 2016 కంటే ఓటు బ్యాంక్ దాదాపు 4 శాతం పెరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.