టీ20: ఆస్ట్రేలియా లక్ష్యం 162

టీ20: ఆస్ట్రేలియా లక్ష్యం 162కాన్​బెరా : టీ మీండియా , ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్​ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ సందర్భంగా టాస్​లో నెగ్గిన ఆసీస్​ కెప్టెన్​ తొలుత బౌలింగ్​ ఎంచుకున్నాడు. ఇదివరకే 2‌‌‌‌-1తో వన్డే సిరీస్​ నెగ్గిన ఆ జట్టు ఇప్పుడు టీ 20పై కన్నేసింది. మరోవైపు మూడో వన్డేలో గెలుపొందిన భారత్​ ఈ మ్యాచ్​లో బోణీ కొట్టి తర్వాతి టీ20లపై పట్టు నిలుపుకోవాలని ఆశిస్తోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తోన్నాయి. అయితే టాస్​ ఓడి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఓపెనర్​ రాహూల్​ 40 బంతుల్లో 51 రన్స్​ చేశారు. టీ20పై క్రీడాభిమానులకు ఆద్యంతం ఆసక్తి నెలకొన్నది.

భారతజట్టు: కేఎల్​రాహూల్​, శిఖర్​ధావన్​, విరాట్​కోహ్లీ, మనీష్​పాండే, సంజూ శాంసన్​, హార్దిక్​ పాండ్య , రవీంద్ర జడేజా , వాషింగ్టన్​సుందర్​, దీపక్​ చాహర్​, నటరాజన్​, షమీ
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్​ఫించ్​(కెప్టెన్​) డిఆర్కీషార్ట్​, మాథ్యూవేడ్​, స్టీవ్​స్మిత్​, మాక్స్​వెల్​,హెన్రిక్స్​ , సీన్​ అబోట్​, మిచెల్​స్టార్క్​, మిచెల్​ స్వీప్సన్​, ఆడంజంపా, జోష్​ హాజిల్​వుడ్​