అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

అమ‌రావ‌తి : అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు మరోసారి సస్పెన్షన్‌కు గురయ్యారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులను స్పీకర్‌ సభ నుంచి బయటకు పంపించారు. నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి, జోగేశ్వరరావు, సత్యప్రసాద్‌, అశోక్‌, రామరాజుల‌ను సస్పెండ్‌ చేశారు. వీరితో పాటు చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అమూల్‌పై చర్చ జరుగుతుండగా చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం.