పోస్టల్​ బ్యాలెట్​లో ఫలితాలు వెల్లడి

పోస్టల్​ బ్యాలెట్​లో బీజేపీ ఆధిక్యం రెండో స్ధానంలో టీఆర్​ఎస్​

పోస్టల్​ బ్యాలెట్​లో ఫలితాలు వెల్లడి

హైదరాబాద్: గ్రేటర్​ మున్సిపల్​ ఎన్నికల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
మొదట పోస్టల్​ బ్యాలెట్​ను అధికారులు లెక్కించారు. పోస్టల్​ బ్యాలెట్​ కౌంటింగ్​లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది. టీఆర్​ఎస్​ రెండో స్థానంలో ఉంది. ఎంఐఎం మూడో స్థానం, కాంగ్రెస్​ నాలుగో స్ధానంలో ఉందని అధికారులు ప్రకటించారు. పోస్టల్​ బ్యాలెట్​లో బీజేపీకి 84, టీఆర్​ఎస్​కు 30, ఎంఐఏం 17 , కాంగ్రెస్​ 2 ఓట్లను సాధించింది. అయితే పోస్టల్​ బ్యాలెట్​ ఓట్ల లెక్కింపు సాధారణ ఓట్లలో కనిపించదని టీఆర్​ఎస్​ నాయకులు చెబుతున్నారు. కానీ ఇదే వేవ్​ చివరి వరకు కొనసాగుతుందని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. కాసేపట్లో మొదటి రౌండ్​ ఫలితాలు వెల్లడికానున్నాయి. కౌంటింగ్​ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.