విజయానికి దగ్గరగా కివిస్

విజయానికి దగ్గరగా కివిస్స్పోర్ట్స్​ డెస్క్​ :  వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్​ విజయానికి చేరువైంది. మొదటి ఇన్నింగ్స్​లో131 రన్స్​కే ఆలౌటై ​ ఫాలోఆన్​లో పడ్డ వెస్టిండీస్​ ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్​లో 6 వికెట్ల నష్టానికి 244 రన్స్​ చేసింది. చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్న కరీబియన్లు.. న్యూజిలాండ్​ తొలి ఇన్నింగ్స్​ స్కోరుకు ఇంకా 85 పరుగులు వెనుకబడి ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్​లో తడబడ్డ విండీస్​ రెండో ఇన్నింగ్స్​లో క్యాంబెల్​(68), కెప్టెన్​ హోల్డర్​(60 బ్యాటింగ్​) పోరాటంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. న్యూజిలాండ్​ బౌల్ట్​3, జెమీసన్​ రెండు వికెట్లు పడగొట్టారు.