డిగో మారడోనా అంత్యక్రియలు పూర్తి

డిగో మారడోనా అంత్యక్రియలు పూర్తిబ్యూనస్‌ ఎయిర్స్‌: ఫుట్‌బాల్‌ మాంత్రికుడు, అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా అంత్యక్రియలు పూర్తయ్యాయి. వేలాది మంది అభిమానుల బాధాతప్త హృదయాలు.. అశ్రు నిరాజనాలతో ఆరాధ్య ఆటగాడు డిగోకు శుక్రవారం తుది వీడ్కోలు పలికారు. ‘డిగోకు మరణం లేదు.. మా మనసుల్లో చిరస్థాయిగా ఉంటాడు’ అంటూ ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. సంద్రాన్ని తలపించేలా రహదారులపై ఉన్న జనం మధ్య అర్జెంటీనా జాతీయ జెండా, 10 నంబర్‌ జెర్సీ కప్పి ఉంచిన శవపేటికలో మారడోనా అంతిమయాత్ర జరిగింది. అనంతరం జర్డిన్‌ బెల్లావిస్టా శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో మారడోనా అంత్యక్రియలు జరిగాయి. తల్లిదండ్రుల సమాధుల దగ్గరే డిగో పుడమి ఒడికి చేరాడు. అంత్యక్రియల కార్యక్రమానికి 24 మంది మాత్రమే హాజరు అయ్యారు. శ్మశాన వాటిక బయట వేలాది మంది ప్రజలు మారడోనాకు జేజేలు పలికారు.